దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నాడు

బైబెల్ చెబుతున్నది “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”

సమస్య ఏమిటంటే . . .

మనమందరమూ మన జీవితంలో పాపాన్ని కలిగివున్నాము. పాపం అంటే దేవునికి ప్రీతికరం కానిది ఏదైనా అది మన మాట, ఆలోచన లేదా క్రియ ఏదైనా సరే. మన పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది.

బైబెల్ చెబుతున్నది “ఏ బేధమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు”. దేవుడు సంపూర్ణుడు మరియు పరిశుద్ధుడు, మన పాపాలు మనల్ని దేవుని నుండి శాశ్వతంగా దూరం చేస్తున్నాయి. బైబెల్ చెబుతున్నది “పాపము వలన వచ్చు జీతము మరణము.”

అయితే శుభవార్త ఏమిటంటే 2000 వేల సంవత్సరాల’ క్రితం,

దేవుడు తన సోంత కుమారుని, యేసును, మన పాపాల నిమిత్తం మరణించేందుకు పంపాడు.

యేసు దేవుని కుమారుడు. ఆయన పాపరహిత జీవితాన్ని జీవించి, మన పాపములను క్షమించుటకు తన జీవితాన్ని త్యాగం చేసి సిలువలో మనకొరకు మరణించాడు.

యేసు మ్రుతులలో నుండి లేచి ఇప్పుడు పరలోకంలో దేవునితో జీవిస్తున్నాడు. యేసు పాతిపెట్టబడ్డాడు అయితే దేవుడు తన శక్తిని బట్టి మూడవదినమున ఆయనను లేపాడు.యేసు తిరిగి లేచిన తర్వాత 500 మందికి పైగా కనిపించాడు మరియు ఆరోహనమై ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన మీద విశ్వాసముంచిన వారికొరకు ఆయన స్థలం సిద్ధం చేస్తున్నాడు. యేసు నిత్య జీవం అనే వరాన్ని మనకు ఇస్తున్నాడు– నిరంతరం పరలోకంలో ఆయనతో జీవించేందుకు– అయితే కేవలం మనం ఆయనను మన ప్రభునిగా, రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఇది జరుగును

యేసు -నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను; నాద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.

దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు ఆయన నీతో వ్యక్తిగత సంబంధం కలిగివుండాలని ఆశిస్తున్నాడు. “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” నీవు యేసుని నీ పాపములు క్షమించి నీ జీవితానికి ప్రభునిగా మరియు రక్షకునిగా ఉండమని అడగవచ్చును.

నీవు యేసుని అంగీకరించ దలచిన యెడల ఈ విధంగా ప్రార్ధించి ఆయనను నీ రక్షకునిగా మరియు ప్రభునిగా చేసుకోన వచ్చు

ప్రియ దేవా, నా పట్ల నీకున్న ప్రేమకై వందనాలు. నా జీవితంలో నీకు ప్రీతికరం కాని ఆలోచనలు, మాటలు మరియు క్రియలు ఉన్నవని నేను గ్రహించాను. అయితే యేసు క్రీస్తు నా పాపం క్షమించడానికి నా స్థానంలో మరణించాడని తద్వారా నిన్ను నేను వ్యక్తిగతంగా తెలుసుకోగలనని నేను నమ్ముతున్నాను. నాలో నీవు నివసిస్తూ నీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించేందుకు సహాయం చేయుమని నేను నా హృదయ పూర్వకంగా అడుగుతున్నాను. నేను నిన్నే నిజమైన సజీవుడైన దేవునిగా ఆరాధిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నీ ప్రేమను బట్టి, నీ క్షమాపణను బట్టి , ఈ జీవితం ముగిసిన తర్వాత నీతో ఉండే నిత్య జీవమును గూర్చి నీవిచ్చిన వాగ్ధానమును బట్టి నీకు వందనాలు. యేసు నామమున ప్రార్ధిస్తున్నాను తండ్రి ఆమెన్.

 

నీవు ఈ రోజు ఈ ప్రార్ధన చేసావా ?

అవును
 

నమీ దగ్గరలో ఉన్న సంఘం గురించి తెలుసుకోవాలంటే దయచేసి కింద క్లిక్ చేయండి.

సంఘంతో అనుసంధానం చేయబడండి